Saturday, October 6, 2012

Summer holidays (ఎండాకాలం సెలవులు)

(Translated by: Swatee Sripada)

Summer holidays
-----------------

It seems as if an artery
That prints on the mind paper
The scenes caught firmly by retina
Has broken
Somersaulting
Along the airstream
Floating as a mere white paper…

The fragrances trapped in the nostrils
Fail to intoxicate the soul
As if an empty jasmine without any tang
Whither down merely…

As if breaking suddenly the life pulse
That accords stimulation to the heart
And the bucket that draws out thoughts
Slithered into the well…

Old poems dried loosing wetness
On the cloths-line
Turning pale
Losing the colors in the sunlight

Now... the poetry has summer holidays

I should go to my village in a red bus
To blasting my blunt thoughts
I should get some ammunition
From my childhood friend.

Telugu:
Published in Andhrajyothi Sunday

Me… and a dawn (నేనూ... ఓ ఉదయం)

(Translated by: Swatee Sripada)

Me… and a dawn
--------------------
Under the shade of darkness
Spreading silence
The night Relaxes without any worry

Carrying the entire world
On the edge of a thorn
Patting its back every second moving forth
As if the multi hued scenes reached a conclusion
Of weaving but not
As if someone pressed a rewind button
The dreams coil around a reel of thread

The crop of light
Cut in the western hills
Rising up in eastern premises
Sun winnows it
A sparrow meditates
On the edge of roof
To bless a few grains
On the face of daybreak

The fog commits suicide
In the crack of dawn
May be the vile darkness
Dumped it after using

The wisps of grass
With pity
Turn into tears

Closing my eyes
Unwinding the reel of dreams
I am stitching a story

Telugu:
Published in Andhrajyothi Vividha:

An Earthen Pot (మట్టి కుండ)

Translated by S.N.Murthy (http://teluguanuvaadaalu.wordpress.com/2012/09/28/an-earthen-pot-ravi-verelly/)

An Earthen Pot
---------------

Someone is walking away
sacking the clay
sedimented
on the banks
abraded and
shoved by Time.
*
Wetting the heap of argil
on the potter’s wheel occasionally,
The Moment is
Pressing it to shape.

Separating it from the wheel in a trice
like a midwife who snaps the umbilical,
Youth harmonizes it
tapping it with a spatula.

Manhood is the brittle,
shapely, unburnt pot
dried up in the sun.
It is time to burn it
in the kiln of life.
*­­­­
Sir !
Putting your ears to it
and tapping it with your knuckles
you test my quality.
Am I sound?
*
O, my dear son!
You circle around the pyre
With potful of water
Without looking back.
Child!
Hold the pot rather carefully!











మట్టి కుండ
-----------

తోసుకుంటూ
కోసుకుంటూ వెళ్తున్న
కాలం వొరిపిడికి
వొడ్డుచేరిన సన్నటి మట్టిని
మూటల్లో నింపుకుని
ఎవరో
నడుచుకుంటూ వెళ్తున్నారు.
*
దిమ్మె మీదున్న
లేలేత మట్టిముద్దకు
తడి అద్దుతూ
ఏదో ఆకారాన్నిస్తూ
సారె చక్రం తిప్పుతూ
సమయం.

మంత్రసానిలా
బొడ్డుపేగును కసుక్కున కత్తిరించి
సారె నుంచి వేరు చేసి
సవరింపుల కర్రతో
వీపంతా దబదబా బాదుతూ
కౌమార్యం.

ఎండలో ఆరబెట్టిన
అందమైన పచ్చి పెళుసు మట్టికుండ
యవ్వనం.

కష్టాల ఆవంలో జీవితాన్ని కాల్చాలిక.

*

కుండ చెవికానించి
కుడిచేయి తిప్పి
వేళ్ళ మెటికలతో కొడుతూ
నాణ్యత చూసే వో అయ్యా

నే మోగుతున్నానా?

*

నిండిన నీళ్ళ కుండెత్తుకుని
వెనక్కి తిరగకుండా
కట్టెల చుట్టూ తిరుగుతున్న
వొ కొడుకా
కుండ జర పైలం.

పిల్లతెమ్మెరలా నువ్వొచ్చి పువ్వు తుంచుకెళ్ళవా?!

సుదీర్ఘమైన చర్చ
వొక కొలిక్కి వచ్చేలోపే ముగిసినట్టు
చీకటివెలుగుల్ని వొడుకుతున్న
కాలం చేతుల్లో రంగు మారిన దారం.

వెన్నెలతో కచేరీ కోసం కాబోలు
వెలుగుతూ ఆరుతూ
చుక్కలు ఏదో రాగాన్ని ట్యూన్ చేసుకుంటున్నాయ్.

అలా వాకిట్లో మంచం వాల్చానో లేదో-
ఒక్కొక్కటిగా
నా జ్ఞాపకాలన్నీ పులుముకుంది
ఆకాశం.

ఎప్పట్లాగే
గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చా.
వర్తమానం చురుక్కుమంది.

ఇక
ఈ రాత్రి కొమ్మకు పూసిన
దిగులు పువ్వు
ఇప్పుడప్పుడే
రాలిపోయేట్టు లేదు.

Friday, October 5, 2012

రాత్రికి లోకువై...

కలిసినట్టే కలిసి విడిపోయే
రాత్రీపగళ్ళ పగుల్లనుంచి

ఒంటరి రోజులన్నీ
ఒక్కొక్కటే
విడివిడిగా దొర్లిపోతుంటే
కలిసి పంచుకున్న
ఆ కొన్ని క్షణాలు కూడా
కన్రెప్పల సందుల్లోంచి
ఎప్పుడో ద్రవించి పోయాయిలే.

చీకటి కేం
అంచులను చురకత్తుల్లా చేసి
రంపపుకోత కొస్తుంది
ఎంతైనా
ఒంటరితనాన్ని మోస్తున్నవాళ్ళంటే
రాత్రికి తెగ లోకువ.

ఇదిగో
చీకటి గోడలకు చూపులనతికించి
నడిరాత్రి నడుంమీద
సమయాన్ని చేదిపోస్తూ
ఒక్కొక్క జ్ఞాపకం పూసని
మునివేళ్ళతో మీటుతూ
అరతెరిచిన కళ్ళతో
తపస్సు చేస్తూ…

పొగమంచును మోస్తూ
పొడిచే పొద్దు కోసం
ఎదురుచూసే వెదురు పొదలా
ఇలా…

నా రాత్రులు నావి.

నీ పగళ్ళు నీవి.

రెండు ముక్కలైన
రోజును
అతికిస్తే బావుణ్ణు!

Monday, October 1, 2012

డీల్

Published in Aksharam - Surya Daily: