పల్లెతడి తగిలే కవిత్వం
కోల్పోతున్న మనిషితనాన్ని, పల్లెతడిని అక్షరాల్లో ఆవిష్కరించిన పుస్తకం ‘దూప’. రవి వీరెల్లి ఈ కవితా సంకలనం ముఖచిత్రం ఎంత కొత్తగా ఉందో ఇందులోని కవిత్వమూ అంతే సృజనశక్తిని చాటింది. ‘రవి ఏం చేస్తున్నాడో చూడండి. అమెరికాలో వొక ఆముదాలపల్లిని కట్టుకుంటాడు’, ‘మనిషిని మనిషిగా నిలబెడతాడు’ అన్న ప్రముఖ కవి అఫ్సర్ పరిచయం నిజమే అనిపిస్తుంది. ‘కవిత్వం తనకొక తీరని దూప’ అన్న కవి మాటల్లోని ఆర్ద్రత అర్థమవుతుంది. ఇందులోని కవిత్వం సామాన్యులకు సైతం ఎక్కడా బోర్ కొట్టదు. చిన్నచిన్న మాటల్లో పెద్దపెద్ద అర్థాలు. భావాల్లో చిక్కదనం. ఒక బాధ, ఓ ఆరాటం, ఒకింత తపన అన్నీ గోచరిస్తాయి. తన ఊరు, తన మనిషితనం, తన సామాజికత అన్నీ దూరమవుతున్న వైనాన్ని చక్కగా కవితల్లో ఆవిష్కరించారు. ‘విశ్వం నుండి, రెక్కలు విరిచి, భూమ్మీదకు విసిరి వేయబడ్డ, ఓ రంగుల కల, నేను’ అంటూనే ‘కొత్త రెక్కలతో, అస్తిత్వపు మూలాలు వెతుక్కుంటూ, తిరిగి విశ్వాంత రాళాల్లోకి, నేను’ అని ముగించిన తీరు ఒక్కటి చాలేమో కవి విశాలదృష్టిని తెలియపరచడానికి!
వెల: రూ॥ 50/- ప్రతులకు: -415/9, సప్తగిరి కాలనీ, మియాపూర్, హైదరాబాద్-49. ఫో॥ 8686059533.

No comments:
Post a Comment