Sunday, April 17, 2011

కానుక

ఎడతెగని నీ జ్ఞాపకాల జడివానలో
తనివితీరా తడుస్తూనే
ఎంతకూ ఆరని విరహపు నెగళ్ళమీద
తనువంతా కాల్చుకుంటూ-
మదిలో జలజలా పారే నీ స్మృతుల జలపాతాలు
యెదలో ఏవో గిలిగింతలు పెడుతుంటే-
నీ తలపుల లోయల్లో పూసిన
ఊసుల పూలేరి
ఇదిగో
అపురూపంగా
నా అసువుల బుట్టలో నింపా.

ఇక
నాకు
ఏ జ్ఞాపకమూ
ఏ మరపూ అక్కర్లేదు.

(హంసిని లో ప్రచురితమైన కవిత)

No comments:

Post a Comment